UPDATED 27th APRIL 2018 FRIDAY 9:00 PM
పెద్దాపురం : బార్ అసోసియేషన్ ఎన్నికలు స్థానిక కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వేదుల సుబ్రహ్మణ్యం (మణి), ఉపాధ్యక్షుడిగా తటవర్తి సత్యనారాయణ, జనరల్ సెక్రటరీగా నండూరి వెంకట సూర్యనారాయణ మూర్తి (బాలు), జాయింట్ సెక్రటరీగా కందుల నరేష్ కుమార్, కోశాధికారిగా కలిదిండి కమలాకర్, లైబ్రరీ సెక్రటరీగా మడికి రాంబాబు, లేడీస్ రిప్రజంటేటీవ్ గా ఎస్. విశాలాక్షి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా సాదే నరసింహారావు, కందుల వెంకటచలం, చింతా శ్యామ్ వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని న్యాయవాదులు కె.వి.రాయుడు, గన్నంరాజు సత్యనారాయణ, దేవులపల్లి సూర్యనారాయణ మూర్తి, సారా రామచంద్రరావు, పిట్టా సుగుణారావు, దారా శ్రీనివాస్, కర్రా ఎలీషారావు, దేవులపల్లి రవికుమార్, జి. వినయ్ తేజ, పేరిశెట్టి మృత్యుంజయరావు, ఎన్. దుర్గా ప్రసాద్, మంగిపూడి సూర్యనారాయణ మూర్తి, షేక్ వల్లిబాబు, తదితరులు అభినందించారు.







