ఉపాధ్యాయవృత్తికే వన్నె తెచ్చిన మరిడయ్య

UPDATED 14th SEPTEMBER 2017 THURSDAY 9:00 PM

పెద్దాపురం: ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి బుక్కా మరిడయ్య అని పలువురు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా పెద్దాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో దేవాంగ సంఘం రాష్ట్ర నాయకుడు ఎన్. చినవెంకట్రాయుడు, శారదా రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్ మాట్లాడుతూ మరిడయ్య ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించి పనిచేశారని, ఆయన దగ్గర విద్యను అభ్యసించిన ఎందరో విద్యార్థులు పలు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని ఆయన సేవలను కొనియాడారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత, గణితావధాని తోటకూర సాయి రామకృష్ణ, త్రివర్ణ స్కూల్ అధినేత తోటకూర వెంకటేశ్వరావు,డాక్టర్ వై.వి.బి. ప్రసాదరావు, తాళ్లూరు, పెదబ్రహ్మదేవం, రంగంపేట, రాయభూపాలపట్నం తదితర గ్రామాలకు చెందిన ఆయన అభిమానులు పాల్గొన్నారు.        
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us