UPDATED 3rd JULY 2018 TUESDAY 8:00 PM
గండేపల్లి: నేటి యువతను భావిభారత భవిష్యత్ నిర్మాతలుగా తీర్చిదిద్దడం మన బాధ్యతని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు పేర్కొన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల, వరల్డ్ యూత్ ఛేంజ్ మేకర్స్ సంయుక్త ఆధ్వర్యంలో సమాజంపట్ల యువత, వారి పాత్ర అనే అంశంపై కళాశాలలో మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సునీల్, రుద్రమూర్తిలు వక్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమ వక్తలు వరల్డ్ యూత్ ఛేంజ్ మేకర్స్ ఫౌండర్స్ కృష్ణాజీ, ప్రీతీజీలను పరిచయం చేస్తూ విద్యార్థులు వారి సామర్థ్యాలను, గమ్యాలను తెలుసుకోవాలని, ఆరోగ్యం, విద్యా, బంధం, భవిష్యత్తు, పాత్ర అనేవి జీవితంలో చాలా ముఖ్యమైనవని అన్నారు. వక్తలు తమ అమూల్యమైన సమయాన్ని విద్యార్థులతో గడిపి వరల్డ్ యూత్ ఛేంజ్ మేకర్స్ గురించి వివరిస్తూ, దేశ అభివృద్ధికి తోడ్పడే విధంగా విద్యార్థులలో సామాజిక దృక్పదాన్ని కలిగించినందుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ తమ కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్ మెంట్ ఎమ్.వి. హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మిన్ డాక్టర్ జి. నరేష్, డీన్ అర్&డి డాక్టర్ పి.పి.వి.ఎస్. మాచిరాజు, ఇసిఇ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వి. ప్రశాంత్, కళాశాల పూర్వ విద్యార్థిని రేష్మా చౌదరి, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.







