UPDATED 6th APRIL 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: ప్రత్యేక హోదాపై పెద్దాపురం పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ కోటి కాపుగ౦టి రచించిన పాటల సీడీని తెలుగుదేశ౦ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్య౦ చ౦ద్రరావు శుక్రవారం ఆవిష్కరించి మొదటి కాపీని పెద్దాపుర౦ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజుకి అందచేశారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు కటకంశెట్టి వె౦కట సత్య ప్రభాకర్ నిర్మాతగా.ఈ సీడీని రూపొందించినట్లు పెద్దాపుర౦ పట్టణ తెలుగుదేశ౦ పార్టీ అధ్యక్షుడు రంధి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.







