జనసేనను భారీ మెజారిటీతో గెలిపించాలి

UPDATED 31st MARCH 2019 SUNDAY 9:00 PM

సామర్లకోట: ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు, నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారని, జనసేనను రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎంఎల్ఏ అభ్యర్థి తుమ్మల రామస్వామి(బాబు) అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సామర్లకోట మండలం ఉండూరు, కాపవరం గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడికి వెళ్లినా స్థానికులు పూలతో ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నారు. అలాగే ఆయన పలు చర్చిల్లో ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఉచితంగా వంట గ్యాస్‌ వంటి పథకాలను తీసుకువచ్చారని తప్పకుండా ప్రజలకు వారు కోరుకునే పాలన అందించడంలో జనసేన పార్టీ ముందు ఉంటుందని తెలిపారు. నియోజక వర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, తనను గెలిపిస్తే ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇస్తానని, అలాగే నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తానని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తుమ్మల నాగబాబు, అంజి, సరోజ్ వాసు, ఉదయకుమార్, అధిక సంఖ్యలో పార్టీ  కార్యకర్తలు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us