DGCA: ఏటీసీ క్లియరెన్స్‌ లేకుండానే విమానం ఎగిరింది..

రెడ్ బీ న్యూస్, 2 జనవరి 2022: ఏదైనా ఒక విమానం.. విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ తీసుకోవాలంటే ముందుగా అక్కడి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌(ఏటీసీ) నుంచి ఆయా అనుమతులు తప్పనిసరి. కానీ.. ఇటీవల ఓ విమానం మాత్రం ఏటీసీ క్లియరెన్స్ లేకుండానే టేకాఫ్‌ కావడం గమనార్హం. స్పైస్‌జెట్‌కు చెందిన విమానం డిసెంబరు 30న గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి ఉదయం 9.30కు బయల్దేరి.. 11.15కు దిల్లీలో దిగింది. అయితే, టేకాఫ్‌కు ముందు పైలట్లు.. అవసరమైన ఏటీసీ క్లియరెన్స్ తీసుకోలేదని అధికారులు గుర్తించారు. ‘పైలట్లు రాజ్‌కోట్ ఏటీసీ నుంచి టేకాఫ్ అనుమతి తీసుకోలేదు. దీనిపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీసీఏ)లకు సమగ్ర నివేదిక పంపాం’ అని రాజ్‌కోట్‌ ఏయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ తాజాగా విచారణకు ఆదేశించినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. కమ్యూనికేషన్ లోపమా? లేదా మరేదైనా కారణమా త్వరలో తేలుతుందన్నారు. ‘టేకాఫ్ అనుమతి లేకుండా ఎలా వెళ్లారని రాజ్‌కోట్ ఏటీసీ.. ఆ పైలట్‌లను ప్రశ్నించింది. ఇందుకు వారు పొరపాటు జరిగిందని తెలిపారు. ఈ విషయమై క్షమాపణలూ చెప్పారు’ అని ఏఏఐ సీనియర్ అధికారి ఒకరు.. ఓ జాతీయ వార్తాసంస్థకు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆ పైలట్లను విధుల నుంచి తప్పించినట్లు స్పైస్‌జెట్ ప్రతినిధి వెల్లడించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us