UPDATED 24th JUNE 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో భారీ వర్షానికి ముంపునకు గురైన ప్రాంతాలను
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తోట వాణి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముంపు సమస్యను పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడి అన్నివిధాలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పిడుగుపాటుకు గురై మృతి చెందిన వ్యవసాయ కూలీ కొండేపూడి అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట గోలి వెంకట్రావు, బొబ్బరాడ సత్తిబాబు, నున్న చిన్ని, వల్లూరి పెద్ద, బాబ్జి, తదితరులు పాల్గొన్నారు..







