UPDATED 24th AUGUST 2017 THURSDAY 7:00 PM
గండేపల్లి: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించాలని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక ప్రతిమల పంపిణి కార్యక్రమంలోగురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలంతా పర్యావరణాన్ని పరిరక్షించాలని, ప్రకృతి సంబంధమైన ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతీ గ్రామంలో పెద్దఎత్తున జరుగుతున్నఉత్సవాలలో విధిగా మట్టి వినాయక ప్రతిమలనే ఉపయోగించాలన్నారు. అలాగే సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్.రమాశ్రీ శ్రీ శారదా రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్, సభ్యులు జి. ప్రకాష్, కె.సతీష్, కె.శ్రీనివాస్, భాస్కర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







