UPDATED 25th JUNE 2018 MONDAY 6:30 PM
పెద్దాపురం: స్థానికి ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఏడు అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. ఏలేశ్వరం మండలం సి. రాయవరం గ్రామానికి చెందిన పలివెల చిన్నికృష్ణ ఇళ్ళస్థలం కోసం, అదే మండలం పెద్దనాపల్లి గ్రామానికి చెందిన పి. గంగా కోటేశ్వరరావు స్థల ఆక్రమణ నిమిత్తం, పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన ఆశీర్వాదం డ్రైనేజీ సమస్య గురించి, అదే గ్రామానికి చెందిన వరిసాగు రైతులు సాగునీరు కాలువ అభివృద్ధి చేయమని, శంఖవరం మండలం అన్నవరం గ్రామానికి చెందిన వి. సత్యనారాయణ పంట రుణమాఫీ ఇప్పించమని, పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామానికి చెందిన ఎం. గోవిందరావు పట్టాదారు పాస్ బుక్ మంజూరు నిమిత్తం, పెద్దాపురం పట్టణం కొండయ్య పేటకు చెందిన డి. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు నిమిత్తం అర్జీలు వచ్చాయని తెలిపారు.







