ఆదిత్యలో వెబ్ క్రాఫ్ట్ నూతన టెక్నాలజీపై శిక్షణా తరగతులు

UPDATED 19th FEBRUARY 2018 MONDAY 12:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో వెబ్ క్రాఫ్ట్ లో నూతన టెక్నాలజీ అనే అంశంపై మూడు రోజుల శిక్షణా తరగతులు నిర్వహించినట్లు ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రమాశ్రీ మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వెబ్ క్రాఫ్ట్ నిపుణులు వి. రవితేజ ఆధ్వర్యంలో తృతీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుతున్న విద్యార్థులకు శిక్షణా, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెబ్ క్రాఫ్ట్ లో లార్వేల్, వ్యూటిఎస్, గిట్ తదితర నూతన విధానాలు గురించి విద్యార్థులకు వివరించారు. గిట్ అనేది కంప్యూటర్ ఫైళ్లలో మార్పులను పరిశీలించడానికి, పలువురు వ్యక్తుల మధ్య పనిని సమన్వయం చేయడానికి, ఈ వెర్షన్ నియంత్రణ వ్యవస్థ అన్నారు. ప్రధానంగా సాఫ్ట్ వేర్ డవలప్ మెంట్ లో సోర్స్ కోడ్ మేనేజ్మంట్ కోసం, ఏదైనా సెట్ ఫైల్లో మార్పులను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందని వివరించారు. ప్రస్తుతం వెబ్ క్రాఫ్ట్ ఎంతో ఉపయోగమైనదని,  ఉద్యోగాలకు ఎంతో అవకాశమున్న కోర్స్ అని ఆయన విద్యార్థులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వానతి, ప్రొఫెసర్ రాజాబాబు, ప్రొఫెసర్ కె. సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us