ప్రతీ ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలి

UPDATED 21st JUNE 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: ప్రతీ ఒక్కరూ నియమ నిబంధనలను అనుసరించి నిబద్ధతతో పనిచేయాలని, ఎవరికీ  భయపడాల్సిన పనిలేదని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయలో ఎంపిపి ఆకునూరి సత్తిబాబు అధ్యక్షతన ఎంపిడివో కర్రి స్వప్న ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులతో మండల పరిధిలోని  గ్రామాల అభివృద్ధి పనులు, సమస్యలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ప్రతీ శాఖకి చెందిన  అధికారులు సమన్వయంతో పనిచేయాలని పెండింగులో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండస్ట్రీస్ కాలువలోని నీరు మెయిన్ కాలువలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే కరెంట్ కొరత లేకుండా దాన్ని త్వరగా పరిష్కరించాలన్నారు. ఇక నుంచి ప్రతీ గ్రామాన్ని సందర్శించి ఆయా గ్రామాల పంచాయతీల పనితీరులను పరిశీలిస్తానని, అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. దోమకాటు నివారణకు ఆయా గ్రామాల పంచాయతీలు తప్పనిసరిగా గ్రామాల్లో ఫాగింగ్ యంత్రాల ద్వారా నివారణ మందును పిచికారి చేయాలని సూచించారు. మండలంలో చిన్నపిల్లలకు టీకాలు పూర్తి స్థాయిలో వేస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస నాయక్ తెలిపారు. ఎంఇవో వైవి శివరామకృష్ణయ్య మాట్లాడుతూ సర్వశిక్షా అభియాన్ శాఖ నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని, అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తిస్తుందని, మండలంలో 20 మంది వరకు ఉపాధ్యాయుల కొరత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్, వెలుగు, ఉపాధి హామీ, సోషల్ వెల్ఫేర్, ఆర్&బి, ఆర్.డబ్ల్యూ.ఎస్, పంచాయితీ రాజ్, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి అధికారులు ఆయా శాఖల పనితీరును ఎమ్మెల్యేకు వివరించారు. ఈవో పీఆర్డీ సిహెచ్ జగ్గారావు మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల గురించి వివరిస్తూ ఇప్పటికే ఓటర్ల జాబితాను పూర్తి చేయడం జరిగిందని, ఇక ఎట్టి పరిస్థితుల్లో చేర్పులు, మార్పులకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎంపిడివో స్వప్న మండల ప్రగతిని వివరించారు. ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ ఎ. రాజశేఖర్, పంచాయతీరాజ్ డిఇ ఎ. రవి, తహసీల్దార్ సిహెచ్ నరసింహారావు, మురళీకృష్ణ ఎక్సైజ్ ఇనస్పెక్టర్ ఎంవివి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us