UPDATED 14th FEBRUARY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: పదవతరగతి పబ్లిక్ పరీక్షలలో పదికి పది జిపిఎ సాధించటానికి అవసరమైన విలువైన సూచనలను ఉపాధ్యాయులు విద్యార్థులకు అందించాలని, అలాగే ప్రతీ విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని ఎంఈవో వై.వి. శివరామకృష్ణయ్య అన్నారు. సామర్లకోట మండలం వేట్లపాలెం, జి. మేడపాడు గ్రామాల్లో గల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవతరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి, పాఠశాలలో ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల వివరాలపై ఆరా తీశారు. జిల్లా పరిషత్ అందజేసిన మెటీరియల్ తో పాటు సి, డి గ్రేడ్ విద్యార్థుల కోసం పాఠశాలలో అమలు చేస్తున్న కార్యాచరణను పరిశీలించారు. అలాగే పాఠశాలలో మధ్యాహ్నభోజన నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కె. లక్ష్మీసుజాత, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.







