శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిత్యలో ప్రత్యేక పూజలు

UPDATED 23rd OCTOBER 2020 FRIDAY 5:00 PM

గండేపల్లి (రెడ్ బీ న్యూస్): శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల సరస్వతీ దేవి ఆలయంలో ఈనెల 24 దుర్గాష్టమి, 25 విజయదశమి పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉదయం గణపతి పూజ, అమ్మ వారికి విశేష అభిషేకాలు, అలాగే సాయంత్రం కుంకుమార్చనలు, సహస్ర పుష్పార్చన, నక్షత్ర హారతి, నీరాజన మంత్రపుష్పం, ప్రసాద వితరణ ఉంటుందని అన్నారు. విజయదశమి పర్వదినం నాడు మానవాళి శ్రేయస్సు కోసం ఉదయం ధన్వంతరీ హోమం, రాత్రికి శమీపూజ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ అధినేతలు డాక్టర్  నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులతో పాటు, ఆదిత్య సంస్థల కుటుంబ సభ్యులు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించి అమ్మ వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us