విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

UPDATED 26th OCTOBER 2017 THURSDAY 6:00 PM

గండేపల్లి: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఎల్. వేణుగోపాల్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ లో గల ఫోరెన్సిక్ సైన్స్ కళాశాలలో గురువారం నిర్వహించిన విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి విద్యను అభ్యసించాలని, భావ వ్యక్తీకరణ, సమయపాలన అలవరచుకోవాలన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు నిరంతర సాధన చేయాలని, కొంతమంది యువకులు అనవసరమైన భయాందోళనలతో ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం ఎంతో బాధాకరమన్నారు. జాతి నిర్మాతలైన విద్యార్థులు భవిష్యత్ తరాలను శాసించేలా మార్గదర్శకులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ఫోరెన్సిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ. మోహన్, బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి , విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.              

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us