వెనుకబడిన వర్గాల సంక్షేమానికే మెగా గ్రౌండ్ మేళాలు

UPDATED 28th DECEMBER 2018 FRIDAY 6:00 PM

రంపచోడవరం: పేదరికంపై గెలుపు సాధించే దిశగా మెగా గ్రౌండింగ్ మేళాలు, ఆదరణ పధకాల ద్వారా నిరుపేదలకు ఆధునిక పనిముట్లు అందించి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి ప్రతీ గిరిజన కుటుంబం కనీసం రూ.10 వేలు ఆదాయం పొందేందుకు రాష్ట్ర ప్రభ్వుతం కృషి చేస్తోందని ఐటిడిఎ పివో నిషాంతకుమార్ అన్నారు. స్థానిక ఐటిడిఎ కార్యాలయ ప్రాంగణంలో ఎస్టీ, ఎస్సీ, బిసి, కాపు, మైనార్టీ శాఖల మెగా గ్రౌండింగ్ మేళా-3ని నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహించి పివో నిషాంత్ కుమార్, స్థానిక శాసన సభ్యురాలు వంతల రాజేశ్వరి లబ్ధిదారులకు యూనిట్లు శుక్రవారం పంపిణీ చేసారు. ఈ సందర్భంగా పివో మాట్లాడుతూ కుల వృత్తులు, చేతివృత్తులు సజీవంగా ఉంటేనే సమాజం సమతౌల్యంగా ఉంటుందని, ఆయా వర్గాలకు ఆర్ధికంగా చేయూత నివ్వాలని ఆదరణ పధకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి మెగా గ్రౌండింగ్ మేళాలు నిర్వహిస్తోదని అన్నారు. బ్యాంకర్లు, అధికార యంత్రాంగ సమన్వయంతో రాయితీలు అందించి పేదరికాన్ని జయించేలా పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. నిరుపేద కుటుంబాలు వారు సబ్సిడీల ద్వారా రుణాలు పొంది జీవనోపాధులు మెరుగుపర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా చేతివృత్తులు, ఆధునీకరణ పరికరాలు పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకొందని తదనుగుణంగా శారీరక శ్రమ తగ్గమేకాకుండా ఉత్పాదకత పెరుగుతుందన్నారు. యూనిట్ల మంజూరులో ఎంపిడివోలు, బ్యాంకర్లు చురుకైన పాత్ర పోషించి రాష్ట్రంలోనే అన్ని ఐటిడిఎలకన్నా మన ఐటిడిఎని అన్నిరకాలుగా యూనిట్ల మంజూరులో ముందంజలో నిలిపారన్నారు. ఈ మూడవ మెగా గ్రౌండింగ్ మేళాలో నియోజకవర్గ స్థాయిలో సుమారు 1021 మంది లబ్దిదారులకు రూ.8 కోట్ల 40 లక్షలు విలువ గల పనియుట్లు అందించడం జరిగిందని, వీటిలో ట్రైకార్ ద్వారా 260 మందికి రూ.356 లక్షలు, ఉద్యాన విభాగం ద్వారా పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, స్పేయర్లు 326 మంది లబ్దిదారులకు రూ.54 లక్షలు విలువగలవి అందించారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా 141 మందికి రూ.181 లక్షలు, బిసి కార్పోరేషన్ ద్వారా 34 మందికి రూ.24 లక్షలు, కాపు కార్పోరేషన్ ద్వారా 55 మందికి రూ.43 లక్షలు, ఆదరణ పధకం ద్వారా 74 మందికి రూ 4.55 లక్షలతో ఆధునిక పనిముట్లు అందించారు. ఎంఎల్ఏ వంతల రాజేశ్వరి మాట్లాడుతూ పేదరికంపై గెలుపు సాధించేలా ఇప్పటి వరకు మూడు విడతలుగా మెగా గ్రౌండింగ్ మేళాలు నిర్వహించామని, ఇంకా ఎవరైనా లబ్దిదారులు మిగిలివుంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేదరికంపై గెలుపు సాధించాలనే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆదిశగా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, బ్యాంకర్లు సమన్వయంతో సత్పలితాలు తీసుకొని రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సలహాసంఘ సభ్యురాలు కారం ఫణేశ్వరమ్మ, జన్మభూమి కమిటీ సభ్యులు అడబాల బాపిరాజు ఎపివోలు నాయుడు, వెంకటేశ్వరరావు, వెలుగు ఎపిడి వై. సత్యం నాయుడు, డిడి ఎం సరస్వతి, హెల్త్ సీనియరు కోఆర్డినేటర్ డి.ఎన్. మూర్తి, ఎంపిడివోలు, తహసీల్దార్ లక్ష్మీకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us