ఆధునిక కమ్యూనికేషన్స్ పై అవగాహనా సదస్సు

UPDATED 22nd SEPTEMBER 2018 SATURDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో రీసెంట్ ట్రెండ్ ఇన్ వైర్ లెస్ కమ్యూనికేషన్ అనే అంశంపై ఒకరోజు అవగాహనా సదస్సు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిఎస్ఎన్ఎల్ సబ్ డివిజినల్ ఇంజనీర్ ఎమ్. భగవాన్ ప్రసాద్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడంతో పాటు వాటిని శాసించే స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ నూతన టెక్నాలజీపై సరైన అవగాహన కలిగి ఉండాలని, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న నూతన ఆవిష్కరణలను అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి ప్రొఫెసర్ జి. రామకృష్ణ, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us