UPDATED 11th OCTOBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట పట్టణం పరిధిలోని బ్రౌన్ పేట సెక్టార్ పరిధిలో గల అంగన్వాడీ కేంద్రాల్లో దసరా ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం బొమ్మల కొలువు కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ బాలాత్రిపురసుందరి అధ్యక్షన నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిడిపివో పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ దసరా ఉత్సవాలపై ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు పిల్లలను ఆకట్టుకుందని, అలాగే చిన్నారులకు రంగులను పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా అక్టోబరునెల రంగు అయిన ఆరెంజ్ రంగును పరిచయం చేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంవి శ్రీలక్ష్మి, నాగమణి, మాలతి, శ్యామల, శేషు రత్నం, అప్పలకొండ, రమణి, సరోజ, సుభద్ర, తదితరులు పాల్గొన్నారు.







