UPDATED 27th JANUARY 2019 SUNDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో ఈ నెల 28న మెగా రక్తదాన శిభిరం నిర్వహిస్తున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ఆదిత్య వ్యవస్థాపక సభ్యులు, ఆదిత్య విద్యా సంస్థల కార్యదర్శి నల్లమిల్లి లక్ష్మీరాజ్యం జన్మదినం (ఆదిత్య వ్యవస్థాపక దినోత్సవం) సందర్భంగా ఆదిత్య సిబ్బంది, విద్యార్థుల సౌజన్యంతో నిర్వహించే ఈ మెగా రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ఈ శిబిరాన్ని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం ప్రారంభిస్తారని తెలిపారు. 2005 సంవత్సరం నుంచి ప్రతీ సంవత్సరం జనవరి, ఆగష్టు నెలల్లో ఈ మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి జిల్లాలో గల ప్రముఖ బ్లడ్ బ్యాంక్ లకు అందచేస్తున్నామని, అత్యధిక యూనిట్ల రక్తం అందించిన సందర్భంగా గతంలో రాష్ట్రస్థాయి అవార్డులు సైతం ఆదిత్య కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్ కె. రవిశంకర్, ప్రొఫెసర్ వై. సురేంద్రనాధ్ రెడ్డి, డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, వివిధ కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.







