UPDATED 24th SEPTEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక సత్యనారాయణపురంలో చంద్రన్న బీమా పథకం క్రింద అందచేస్తున్న పసుపు కుంకుమలపై మీపమా సోమవారం సర్వే నిర్వహించారు. రోజుకు 10 గ్రూపుల చొప్పున ఉదయం ఐదు, సాయంత్రం ఐదు గ్రూపులను ఎంపిక చేసి వారికి వడ్డీలేని రుణాలు, పసుపు కుంకుమ కింద ఇస్తున్న రుణాలను సక్రమంగా వినియోగించుకుంటున్నారా లేదా అనే విషయంపై సర్వే నిర్వహించారు. అలాగే ప్రతీ డ్వాక్రా గ్రూపుకు సంబంధించిన మహిళలు తప్పనిసరిగా పసుపు కుంకుమల సంబంధించిన వివరాలు తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







