వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

UPDATED 28th MARCH 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక మఠం సెంటర్ లో టిడిపి నేతలు బుధవారం వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా నిజాయతీగల నేతగా ప్రజల అభిమానం పొందిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అనీ, అలాంటి వ్యక్తిపై ఆర్థిక నేరాలకు పాల్పడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న విజయసాయిరెడ్డి ఇష్టానుసారం నోరుపారేసుకోవడం ఆయన సంస్కార హీనతకు నిదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, పాలకుర్తి శ్రీనుబాబు, భీమేశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్ రావు, కుర్రా నారాయణస్వామి, చల్లా బుజ్జి, కౌన్సిలర్ చుండ్రు బలరాం, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us