మోడల్ మేకింగ్ లో పోలవరం ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి

UPDATED 27th SEPTEMBER 2019 FRIDAY 8:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఫైనల్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ చదువుచున్న విద్యార్థులు గురువారం సూరంపాలెంలోని ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన టెక్ ఫెస్ట్ మోడల్ మేకింగ్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ తమ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుచున్న విద్యార్థులు జె. సతీష్, ఎం. కన్నయ్య, కె. సోమేష్ అండ్ టీమ్ మోడల్ మేకింగ్ విభాగంలో ప్రదర్శించిన పోలవరం ప్రాజెక్టు మోడల్ కు ప్రథమ బహుమతి లభించిందని అన్నారు. మొత్తం ఈ విభాగంలో 29 టీములు పాల్గొన్నాయని, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల టీమ్ ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థి బృందాన్ని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి  సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి బి. కొండబాబు, తదితరులు అభినందించారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us