UPDATED 6th JANUARY 2019 SUNDAY 7:00 PM
పెద్దాపురం: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య డిగ్రీ కళాశాల ఫోరెన్సిక్ సైన్స్ ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో ఈ నెల ఆరు నుంచి 12వ తేదీ వరకు ఆయుష్యం పేరుతో ప్రత్యేక ఆరోగ్య అవగాహనా శిబిరం ఆదివారం ప్రారంభించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ శిబిరాన్ని గ్రామ మాజీ సర్పంచ్ సింగన అరవిందకుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ శిబిరంలో దంత, కంటి సమస్యలకు సంబంధించి అవసరమైన వైద్యం ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ నిర్వహించిన ఆలపించిన గీతాలు, నృత్యాలు, నాటక ప్రదర్శనలు పాఠశాల చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి.







