UPDATED 16th OCTOBER 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు చిత్రలేఖనం, క్రాఫ్ట్ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించినట్లు పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాకినాడలో నిర్వహించిన ఆర్ట్స్, క్రాఫ్ట్ పోటీల్లో చిత్రలేఖనం విభాగంలో పార్వతి, జగదీష్, అవినాష్, క్రాఫ్ట్ విభాగంలో కె. దుర్గాభవాని, పి. మహాలక్ష్మి, సత్యశ్రీ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు సాధించినట్లు తెలిపారు. అలాగే పాఠశాల క్రాఫ్ట్ ఉపాధ్యాయిని కె. సుబ్రహ్మణ్యేశ్వరి, డ్రాయింగ్ ఉపాధ్యాయిని వై. కుసుమ ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు పొందినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులను పేరెంట్స్ కమిటీ చైర్మన్ నక్కా జానకిరామయ్య, కమిటీ ప్రతినిధులు, తదితరులు అభినందించారు.







