విద్యను మించిన సంపద లేదు

* ఆర్డీవో వసంతరాయుడు

UPDATED 7th OCTOBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: ఎన్నికోట్ల ఆస్తి ఉన్నా విద్యను మించిన సంపద లేదని, చదువుకునే వయసులో చక్కగా చదువుకుంటే జీవితం బంగారు భవిష్యత్తుగా మార్చుకోవడంతో పాటు తమ పిల్లల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు పేర్కొన్నారు. స్థానిక అయోధ్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ తరగతులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ విద్యార్థులు తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా  మధ్యలో చదువు మానేశామని ఆందోళన చెందకుండా ఓపెన్ స్కూల్ ద్వారా తమ విద్యను కొనసాగించడం సంతోషమని అన్నారు. విద్యార్థులకు చదువు యొక్క విలువను తన జీవిత అనుభవాల నుంచి వివరిస్తూ మంచిగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని కోరారు. సెలవు దినాల్లో  సేవాదృక్పథంతో చక్కగా ఓపెన్ స్కూల్ తరగతులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ, బోధనా సిబ్బందిని అభినందించారు. అలాగే 18 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓపెన్ స్కూల్ అభ్యాసకులకు ఓటు నమోదు ఫారాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరరావు, మేనేజర్ అచ్యుతరాజు, వ్యాయామ ఉపాధ్యాయుడు తాళ్ళూరి వైకుంఠం, శివ మాస్టారు, టిపిఎస్ రమ్య, బిఎల్ వోలు గిడుతూరు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us