అహింసే పరమ ధర్మం..మహాత్ముని జీవితమే సత్యాగ్రహం

UPDATED 2nd OCTOBER  2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: సత్యాగ్రహమే ఆయుధం, అహింసయే మార్గంగా దేశమాత బానిస సంకెళ్లు తెంచిన కత్తిపట్టని స్వతంత్ర యోధుడు మహాత్మాగాంధీ అని శ్రీ భీమేశ్వర లయన్స్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు. రామరాజ్యం, గ్రామస్వరాజ్యం కావాలని కలలుగన్న బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్ముని స్మరించుకుని వారి ఆశయాలను సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు అందచేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు అమలకంటి శ్రీను, కటకం గంగబాబు, మద్దాల శ్రీను, గుండు శంకరరావు, ప్రసాద్, సేపేని సురేష్, వీర్రాజు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us