నేడు ఆదిత్యకు డిజిపి రాక

UPDATED 18th JULY 2017 TUESDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల కు ఈ నెల 19 న రాష్ట్ర  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) నండూరి సాంబశివరావు రానున్నట్లు సంస్థ వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. కళాశాల క్యాంపస్ లో బిఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అనే కొత్త కోర్స్ ను ప్రారంభించేందుకు ఆయన ఇక్కడికి వస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ముత్యాల నాయుడుతో పాటు డిఐజి పి.వి.ఎస్. రామకృష్ణ, జిల్లా ఎస్.పి. విశాల్ గున్ని, రాజమహేంద్రవరం ఎస్పీ రాజకుమారి తదితరులు హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యా విధానంలో ఎప్పటికప్పుడు నూతన పంథా అవలంభిస్తూ కేజీ నుంచి పిజి వరకు వివిధ కోర్సులను అందిస్తున్న ఆదిత్య తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఈ ఫోరెన్సిక్ సైన్స్ ను తీసుకురావడం జరిగిందని 2017-18 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us