ఆదిత్యలో అడ్వాన్స్ ఇన్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ పై అవగాహన సదస్సు

UPDATED 28th JUNE 2018 THURSDAY 5:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం: ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వారి ట్రిపుల్ ఈ విభాగం మూడవ, నాల్గవ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు అడ్వాన్స్ ఇన్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ పై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సదస్సుకు కెఎల్ విశ్వవిద్యాలయంకు చెందిన డాక్టర్ ఒ. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై అధునాతన యాంత్రీకరణ విద్యను ఉపయోగించి నైపుణ్యం పెంపొందించునే విధానం గురించి విద్యార్థులకు వివరించారు. ట్రిపుల్ ఈ విభాగాధిపతి కె. మనోజ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్ ప్రారంభించి విద్యార్థులు ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఈ అధ్యాపక బృందం, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us