UPDATED 16th AUGUST 2018 THURSDAY 8:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో మూలధనం, రాబడి అనే అంశంపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్ధ ఫైనాన్సియల్ ప్రొఫెషనల్స్ సంస్థ డైరెక్టర్ షేక్ జాకీర్ హుస్సేన్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ప్రణాళికలు అమలు చేయడానికి మూలధనం, పెట్టుబడులు అనేవి చాలా ముఖ్యమని, వాటిని వాటాలు, డిబెంచర్లు తదితర పద్దతుల ద్వారా సేకరించి వ్యాపార లావాదేవాల్లో అనుసంధానం చేయడం ద్వారా సంస్థలకు లాభాలు పెరిగి అభివృద్ధి పథంలో ముందుకెళ్తాయన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో నిర్వహించే వ్యాపారాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకుని, వాటి అమలుకు ఇటువంటి శిక్షణా తరగతులు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







