UPDATED 7th JANUARY 2019 MONDAY 8:00 PM
పెద్దాపురం: స్థానిక రామారావుపేటలో గల శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ 11వ వార్షికోత్సవం ఈనెల 8న నిర్వహించనున్నట్లు స్కూల్ డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ కె. సత్యనారాయణ, దక్షిణాఫ్రికా దేశానికి చెందిన నెల్సన్ మండేలా యూనివర్శిటీ మాథెమాటిక్స్ ప్రొఫెసర్ క్లిడే ఫెలిక్స్, అర్జున అవార్డు గ్రహీత, జాతీయ బాడ్మింటన్ ఛాంపియన్ చేతన్ ఆనంద్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పేపర్ ప్రజంటేషన్లు ఉంటాయని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.







