మైనింగ్ ఇంజనీరింగ్ తో యువతకు ఉజ్వల భవిష్యత్తు

* మైనింగ్ & జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ కె.ఎల్.వి. ప్రసాద్
* గైట్ లో ఘనంగా మైనింగ్ డే

UPDATED 1st NOVEMBER 2018 THURSDAY 6:00 PM

రాజానగరం: మైనింగ్ ఇంజనీరింగ్ లో అర్హత సాధించిన యువ ఇంజినీర్లకు ఉజ్వల భవిష్యత్తు ఉందని మైనింగ్ & జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ కె.ఎల్.వి. ప్రసాద్ అన్నారు. స్థానిక గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాల మైనింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇండియన్ మైనింగ్ డే ను గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల మైనింగ్ ఇంజనీరింగ్ విభాగాధిప డాక్టర్ కె. శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనింగ్ & జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ కె.ఎల్.వి. ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. బొగ్గు, రాగి, జింక్, ఐరన్ ఓర్ వంటి ఖనిజాలతో పాటు నిర్మాణ రంగంలో ఉపయోగించే ఇటుక, కంకర, ఇసుక వంటి చిన్న ఖనిజాలు (మైనర్ మినిరల్స్) స్థానిక క్వారీల నుంచి లభిస్తుందని, అయితే ఈ చిన్నఖనిజాలు లభించే గనుల్లో సైతం అర్హత గల వ్యక్తులకే ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. చైతన్య విద్యా సంస్థల సిఈవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు మాట్లాడుతూ గనుల రంగం మనదేశంలో ఎంతో ప్రాధాన్యత గల రంగమని, అందుకే మైనింగ్ విద్యార్థులకు ఉద్యోగవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ధీటుగా నిలవాలంటే తమ విజ్ఞానానికి, నైపుణ్యాలకు పదునుపెట్టడం ఎంతో అవసరమని విద్యార్థులకు సూచించారు. కళాశాల మైనింగ్ విభాగాధిపతి డాక్టర్ కె. శ్రీహరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మైనింగ్ రంగంలో దాదాపు 20 లక్షలు మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, దేశవ్యాప్తంగా 2013  వ సంవత్సరం నుంచి ఇండియన్ మైనింగ్ డేను జరుపుతున్నారని, గైట్ కళాశాలలో ఈ దినోత్సవాన్ని తొలిసారిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మైనింగ్ ఇంజనీరింగ్ లో అర్హత పొందిన వారు వెంటనే ఉద్యోగాలు పొందుతున్నారని, ఇందుకు తమ కళాశాలలో గత సంవత్సరం మైనింగ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన 45 మంది వెంటనే ఉద్యోగాల్లో ప్రవేశం పొందడం ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. అనంతరం మెరిట్ విద్యార్థులకు ముఖ్య అతిధి చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య విద్యా సంస్థల జనరల్ మేనేజర్ ఎ. నరేష్ రాజు, గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్, గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జి. రామానుజం, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, మైనింగ్ విభాగం విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.                 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us