ఆదిత్యలో ముగిసిన ఫ్యాకల్టీ డవలప్ మెంట్ ప్రోగ్రాం

UPDATED 20th NOVEMBER 2018 TUESDAY 5:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఎన్ఐటి(వరంగల్) సౌజన్యంతో నిర్వహించిన ఫ్యాకల్టీ డవలప్ మెంట్  ప్రోగ్రాం విజయవంతంగా ముగిసినట్లు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అనే అంశంపై ఈ వర్క్ షాప్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు ఎన్ఐటి (వరంగల్)కు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ & విభాగాధిపతి డాక్టర్ ఆర్.వి. సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి శాస్త్ర, సాంకేతిక రంగాలలో మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకొని ముందుకు సాగాలని, అందుకు ఇటువంటి కార్యశాలలు ఎంతగానో  ఉపయోగపడతాయని అన్నారు. నేటి విద్యా విధానంలో అధ్యాపకులు నిరంతరం నేర్చుకొంటూ ఉంటే విద్యార్థికి సరైన రీతిలో భోదించే సామర్ధ్యం పెంపొందించుకోగలరని అన్నారు. వారం రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెఎన్టీయు (కాకినాడ) ప్రొఫెసర్ వి. రవీంద్రనాధ్, ఎన్ఐటి (వరంగల్) ప్రొఫెసర్ డి.వి.ఎల్.ఎన్. సోమయాజులు, ఎన్ఐటిఎపి నుంచి నగేష్ భట్టు, బెంగళూర్ నుంచి అశ్విని జిందాల్, లింకేడిన్ పాల్గొని అధ్యాపకులకు విలువైన సూచనలు, సలహాలు అందించారని, వివిధ కళాశాలలకు చెందిన సుమారు 50 మంది అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారని డాక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థలకు చెందిన ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, వివిధ విభాగాల అధిపతులు ప్రొఫెసర్ ఎ. వానతి, ప్రొఫెసర్ ఎం. రాజబాబు, సిఎస్ఇ, ఐటి అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us