ఆదిత్యలో నానో టెక్నాలజీపై వర్క్ షాప్

UPDATED 19th SEPTEMBER 2019 THURSDAY 8:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలో నానో టెక్నాలజీ అనే అంశంపై కార్యశాలను నిర్వహించినట్లు ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జెఎన్టీయు(అనంతపురం) మాజీ వైస్ ఛాన్సలర్, ఆంధ్రప్రదేశ్ ఐ.ఎస్.టి.యు. సెక్షన్ చైర్మన్ కె.లాల్ కిషోర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లాల్ కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాన్ క్రిస్టలైన్ పదార్థాలు, వాటి ప్రత్యేక లక్షణాలు, విభిన్న అనువర్తనాలతో పరిచయం చేయడం అతిథి ఉపన్యాసం ముఖ్య లక్ష్యమని నానో టెక్నాలజీ విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్  మేడపాటి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్ ఎ. రామకృష్ణ, విభాగాధిపతి ఎం. అనిల్ కుమార్, ఐ.ఎస్.టి.యు. కోఆర్డినేటర్ బి. మాణిక్యాలరావు, అధ్యాపక  సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us