UPDATED 12th MARCH 2020 THURSDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను రాష్ట్ర వ్యవసాయ శాఖ కమీషనర్, జిల్లా ఎన్నికల పరిశీలకుడు హెచ్. అరుణ్ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపాలిటీ, ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ అమలు తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో పాటు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి లోపాలకు తావు లేకుండా ఎన్నికల నియమావళిని అనుసరించి సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని ఆయన ఆదేశించారు.







