రుతుస్రావ సమస్యలతో మహిళల్లో అనారోగ్యం

UPDATED 28th MAY 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: రుతుస్రావ సమస్యలపై అవగాహన లేక చాలా మంది మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సిఎంఎం సుధాకర్ అన్నారు. అంతర్జాతీయ రుతుస్రావ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం మహిళా ఆరోగ్య కమిటీ సభ్యులు, ఆర్పీలు రుతుస్రావం, పరిశుభ్రతపై అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ డాట్ ఛాలెంజ్ లో భాగంగా అరచేతిలో ఎర్ర చుక్క వేసుకుని రుతుస్రావ పరిశుభ్రతను గుర్తుగా "రైస్ యువర్ వాయిస్ అండ్ బ్రేక్ ద సైలెన్స్" అనే నినాదంతో ప్లకార్డులతో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఆర్.పిలు, ఎమ్.ఇ.సిలు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us