ఊరు వెళ్తున్నారా.. అయితే మాకు చెప్పండి

UPDATED 28th FEBRUARY 2018 WEDNESDAY 7:30 PM

సామర్లకోట: వేసవి సెలవులకు ఊరు వెళ్తే మాకు తెలియచేయండి. మీ ఇంటి భద్రతకు పోలీస్ సహకారం అందిస్తుందని ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ పట్టణ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖరులతో బుధవారం మాట్లాడారు. వేసవిలో దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉందని, దానిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఎవరైనా ఊరు వెళ్లాల్సి వస్తే స్టేషన్ కు సమాచారం ఇస్తే అటువైపు తమ సిబ్బందితో పర్యవేక్షణ చేస్తామని, దీంతో దొంగతనాలను అరికట్టేందుకు తమకు సహకారం అందించినట్లు అవుతుందన్నారు. అలాగే చాలా మంది ఆరుబయట పడుకుంటారని, పడుకునే ముందు ఇంటికి తాళం వేసి పడుకోవాలని, ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయాలని కోరారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us