ఛాత్ర విశ్వకర్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు

UPDATED 24th JANUARY 2019 THURSDAY 5:00 PM

గండేపల్లి: జాతీయస్థాయి ఛాత్ర విశ్వకర్మ అవార్డును భారత ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విద్యార్థుల బృందాన్ని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి అభినందించారు. విద్యార్థులలో సృజనను వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో భావి ఇంజినీర్ల నూతన ఆవిష్కరణలకు పోటీలు నిర్వహిస్తూ జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (న్యూఢిల్లీ) ఛాత్ర విశ్వకర్మ అవార్డులతో సత్కరిస్తుందని సతీష్ రెడ్డి అన్నారు. తమ సంస్థకు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన విజేతలైన విద్యార్థుల బృందానికి రూ.లక్ష, అలాగే మెంటార్, సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ విధేయరాజ్ కు ప్రోత్సాహక బహుమతిగా ఒక నెల జీతం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో రూపొందించిన రైతు నేస్తం స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ పేరిట ఆవిష్కరించిన ప్రాజెక్టు దేశంలోని ప్రతిష్టాత్మకమైన కళాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రోజెక్టులతో పోటీపడి తమ సంస్థ విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రధమ బహుమతి కైవసం చేసుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా విభాగాధికారిణి జి. శ్రీదేవి, సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ విధేయరాజ్, విద్యార్థులు గాయత్రి హరిప్రియ, శ్రావణి, దీవెన, నిధిశ్రీ, టెక్నిషియన్ విన్నీవిక్టర్ లను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్, విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, తదితరులు అభినందించారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us