UPDATED 21st JANUARY 2020 TUESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మెనూ ప్రకారం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలులోకి తెచ్చినట్లు తహసీల్దార్ వి. జితేంద్ర అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలును మంగళవారం ఆయన పరిశీలించారు. ఆహార పదార్ధాలను రుచి చూసి నాణ్యత పరిశీలించారు. కోడిగుడ్లు ఉడకలేదని విద్యార్థులు చెబుతున్నారని, నాణ్యమైన గుడ్లు సరఫరా చేయాలని లేదంటే చర్యలు తప్పవని ఏజెన్సీ నిర్వాహకులను హెచ్చరించారు. ప్రభుత్వాదేశాల మేరకు మెనూను తప్పక పాటించాలని, ఎలాంటి పరిస్థితుల్లో మెనులో మార్పు చేసినా, పాటించకపోయినా కఠిన చర్యలు తప్పవని అన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.







