ఆదిత్యలో ముగిసిన వర్క్ షాప్

UPDATED 21st SEPTEMBER 2017 THURSDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలు, ఆంధ్రప్రదేశ్ ఐటి సంస్థలు సంయుక్తంగా రెండు రోజులు పాటు నిర్వహించిన "బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ ఏక్తాస్ " వర్క్ షాప్ గురువారం విజయవంతంగా ముగిసినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ఐటి విభాగం ప్రతినిధి పుష్కర్ వోహ్రా నేతృత్వంలో జరిగిన ఈ వర్క్ షాప్ లో ఈసీఈ, సి ఎస్ ఈ, ఐటి కి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కోడింగ్ పరిజ్ఞానం వెలికితీసే విధంగా కార్యాచరణ రూపొందించారు. అనంతరం నిర్వహించిన ఆన్ లైన్ పోటీ పరీక్షల్లో 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణులైన విద్యార్థులు అక్టోబర్ 8, 9, 10  తేదీల్లో విశాఖపట్నంలో జరిగే జాతీయ సదస్సులో పాల్గొంటారని సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ టి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us