పట్టణంలో విద్యార్థుల సర్వే

UPDATED 20th DECEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో నగర దర్శిని-నగర వికాసం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాలకు చెందిన 16 మంది అధ్యాపకులు, 40 మంది విద్యార్థులు గురువారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా  అధ్యాపకులు, విద్యార్థులు వార్డుల్లో పర్యటించి ఇంతవరకు జరిగిన అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలపై సర్వే నిర్వహించి నివేదిక రూపొందించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులకు, అధ్యాపకులకు మున్సిపల్ కమీషనర్  సిహెచ్ వెంకటేశ్వరరావు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, డిఇ సిహెచ్ రామారావు, మేనేజర్ ఎస్. అచ్యుతరాజు, ఆర్ఓ సిహెచ్. వెంకటేశ్వర్లు, టిపిఓ రత్నాకర్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us