గెలుపే ధ్యేయంగా పనిచేయాలి

UPDATED 26th NOVEMBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పెద్దాపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. సామర్లకోట మండలం పవర, గొంచాల, పండ్రవాడ, పనసపడు, నవర గ్రామాల్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా గ్రామాల్లోని బి.ఆర్. అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దొరబాబు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలనను గుర్తు చేసేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సరికొత్త విప్లవాన్ని ఆవిష్కరించేలా ప్రజారంజక పాలన అందుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అందుకే దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బదిరెడ్డి బుజ్జి, పడాల అమ్మిరాజు, ఎలుగుబంటి శ్రీనివాసు, కుడుపూడి శ్రీనివాస్, పెంకే సత్యన్నారాయణ, వై.  శ్రీనివాస్, జి. శ్రీనివాస్, దంగేటి దుర్గాప్రసాద్, పి. విజయ్ కుమార్, పెంకే శ్రీనివాస్, తోట అప్పారావు, పిల్లి గొల్లబాబు, బక్కి సూర్య ప్రకాష్, పిట్టా ప్రభాకర్, కాకర నరసయ్య, బొంగులూరి ధర్మరాజు, పిట్టా సూరిబాబు, ఎన్. రంగారావు, పిల్లి విజయ్ కుమార్, రాయుడు సత్తిబాబు, వెన్నా శివ, నాగబోయిన అచ్చుతరామయ్య, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us