UPDATED 24th FEBRUARY 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనబాట ప్రచార కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. పెద్దాపురం నియోజకవర్గ నాయకులు తుమ్మల రామస్వామి (బాబు) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంటు అధికార ప్రతినిధి అత్తిలి సీతారామస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కుల రహిత సమాజ స్థాపన జనసేన పార్టీతోనే సాధ్యమని అన్నారు. కాకినాడ పార్లమెంటు అధికార ప్రతినిధి అత్తిలి సీతారామస్వామి మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, వృద్ధులకు ప్రభుత్వ ఆశ్రమాలు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మేనిఫెస్టోలో పొందుపరిచారని, అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తును, పార్టీ మేనిఫెస్టో అంశాలు, సిద్ధాంతాలను ఇంటి ఇంటికి వెళ్లి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులూ పెంకే వెంకటలక్ష్మి, సరోజ్ వాసు, పిట్టా జానకి రామారావు, సుంకర కృష్ణవేణి, కొప్పిరెడ్డి నాగబాబు, బుచ్చిరాజు, తోటకూర నాగేంద్ర, మలకల వెంకటేశ్వరరావు, గాది గోవిందరాజు, తోటకూర రమేష్, బండారు రమేష్, కంచుముర్తి బ్రదర్స్, తలారి రామకృష్ణ, తుమ్మల ప్రసాద్, షఫీయుల్లా, పన్నీరు వెంకటేశ్వరరావు, దాసరి సుబ్బు, తదితరులు పాల్లొన్నారు.







