UPDATED 15th AUGUST 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: స్వాతంత్య్ర మహోద్యమంలో సర్వస్వం త్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తితో దేశ అభ్యున్నతికి కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ అన్నారు. 72వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో మహాత్మాగాంధీ విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం పోరాడిన నాయకులను గుర్తు చేసుకోవడంతోపాటు, వారిని ఆదర్శంగా తీసుకుని వారి మార్గంలో పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మద్దాల శ్రీను, కాళ్ల లక్ష్మీనారాయణ, సేపేని సురేష్, శెట్టిబత్తుల దుర్గ, గంపా శివ, ఆదపురెడ్డి శ్రీను, చిట్టిమాని శ్రీనివాస్, పిల్లా సురేష్, చల్లా సత్తిబాబు, జీలకర్ర బాబూరావు, డొల్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.







