UPDATED 27th FEBRUARY 2019 WEDNESDAY 6:00 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎడ్యుకేషన్ ఎక్స్ లెన్స్ అవార్డు లభించినట్లు గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏఐసిటిఇ, అసోచామ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో న్యూఢిల్లీలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డును తాను అందుకున్నానని చెప్పారు. తమ కళాశాలకు ఇప్పటికే ఎన్నో అవార్డులు లభించినప్పటికీ దేశవ్యాప్తంగా అసోచామ్ నిర్వహించిన సర్వేలో తమ కళాశాలకు అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.







