గైట్ అసోసియేట్ ప్రొఫెసరుకు డాక్టరేట్

UPDATED 7th JANUARY 2019 MONDAY 9:00 PM

రాజానగరం: స్థానిక గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కళాశాలకు చెందిన డిఎంఎస్ అసోసియేట్ ప్రొఫెసర్ రాపాక డేవిడ్ గుడ్ విన్ పి.హెచ్.డి పట్టా పొందినట్లు కళాశాల డిఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ పి.ఆర్.కె. రాజు మాట్లాడుతూ ఎకో టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ - ప్రమోషన్ అండ్ ప్రోస్పెక్ట్స్ ఫర్ సబ్ స్టాన్షియల్ టూరిజం అనే అంశంపై గుడ్ విన్ చేసిన పరిశోధనలకుగాను ఒడిశాలో బెరహంపూర్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గుడ్ విన్ ను చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కెవివి సత్యనారాయణరాజు, గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్, గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, తదితరులు అభినందించారు.             

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us