భక్తిశ్రద్ధలతో నవగ్రహాల విగ్రహ ప్రతిష్ట

UPDATED 28th FEBRUARY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట పట్టణంలో వేంచేసిఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయంలో గురువారం ప్రతిభా విద్యానికేతన్ డైరెక్టర్ సిరిపురపు వీరవెంకట గంగాప్రసాద్, సుధారాణి దంపతుల చేతుల మీదుగా అత్యంత భక్తిశ్రద్ధలతో నవగ్రహాల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, పంచగవ్యప్రాసన, నవగ్రహ మండపారాధన, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ఆలయ ధర్మకర్త పుట్టా రాజారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుణ్ణం రాజా, కౌన్సిలర్ కురుకూరి సోమేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ యార్లగడ్డ అక్కిరాజు, బిజెపి పట్టణ అధ్యక్షుడు మార్ని రాంబాబు, పాగా సురేష్ కుమార్, పుట్టా సూరిబాబు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us