సనాతన ధర్మం నిత్య నూతనం

UPDATED 17th MARCH 2020 TUESDAY 9:00 PM

రాజానగరం(రెడ్ బీ న్యూస్): సనాతన ధర్మం నిత్య నూతనమని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మనందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న స్వామీజీ మంగళవారం స్థానిక గైట్ కళాశాలను ఆయన సందర్శించారు. చైతన్య విద్యా సంస్థల చైర్మన్
కెవివి సత్యనారాయణరాజు (చైతన్య రాజు) దంపతులు స్వామీజీని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో స్వామీజీ మాట్లాడుతూ తల్లిదండ్రులను పూజించడం, గురుశిష్య సంబంధం వంటివి హిందూ ధర్మంలో ఉన్నాయని, ప్రతీ ఒక్కరికీ ఆధ్యాత్మిక శక్తి ఎంతో అవసరమని అన్నారు. దేవాలయాల సందర్శన, గురువుల సాంగత్యం ద్వారా ఈ శక్తి లభిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం భక్తులకు స్వామీజీ స్వహస్తాలతో ప్రసాదం అందచేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎంఎల్ఏ కారుమూరి నాగేశ్వరరావు, చైతన్య విద్యా సంస్థల జనరల్ మేనేజర్ ఏ. నరేష్ రాజు, గైట్ ఓఎస్డీ డాక్టర్ ఎన్. బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.                

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us