UPDATED 11th FEBRUARY 2018 SUNDAY 7:30 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పురపాలక సంఘ కార్యాలయం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆదేశాల మేరకు ఆదివారం ఆనందలహరి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న మజ్దూర్ యూనియన్ కార్యాలయ వేదిక వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలో పాల్గొన్న యువతీ, యువకులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ చోడగం వెంకటేశ్వరరావు, డీఈ సోమేశ్వరరావు, మేనేజర్ కె.డబ్యు. జయకర్, తదితరులు పాల్గొన్నారు.







