అమ్మ విలువ అమూల్యం

UPDATED 13th FEBRUARY 2019 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: అమ్మ విలువ వెలకట్టలేనిదని, మనకు జన్మనిచ్చిన అమ్మను పూజిస్తే దైవాన్ని పూజించి నట్లేనని, విద్యార్థులు మంచి క్రమశిక్షణతో చక్కగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగడం ద్వారా అమ్మ రుణం తీర్చుకోవాలని కాకినాడ డివిజన్ ఉప విద్యాశాఖాధికారిణి డి. సుభద్ర పేర్కొన్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ అధ్యక్షతన అమ్మకు వందనం కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీవైఈవో సుభద్ర మాట్లాడుతూ అమ్మ గొప్పతనాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మకు వందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి ఆదేశాలిచ్చిందని పేర్కొన్నారు. హెచ్ఎమ్ ఆధ్వర్యంలో తల్లి గొప్పతనాన్ని చాటేలా విద్యార్థులచే తల్లులకు పాదాభివందనం పుష్పాలతో పూజించడం తల్లి గొప్పతనంపై వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందచేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్ పర్సన్ సప్పా గంగాభవానితో పాటు సుమారు 40 మంది తల్లులకు ఘనంగా సన్మాన సత్కారాలను చేయించారు. అనంతరం హెచ్ఎమ్ ఆధ్వర్యంలో డీవైఈవో సుభద్రను ఘనంగా సత్కరించారు. ఎస్ఎంసి చైర్ పర్సన్ గంగాభవాని చేతుల మీదుగా వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కెవివి సత్యనారాయణ, ఏ. శ్రీవల్లి, ఏపీ రాజేంద్రకుమార్, బి. శ్రీలక్ష్మి, ఏ.ఎల్.వి. కుమారి, కె. అరుణ, జి. గోవిందు, పిడి తాళ్లూరి వైకుంఠం, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us