మార్చి 31న రన్ ఫర్ జీసస్ ర్యాలీ

UPDATED 29th MARCH 2018 THURSDAY 10:00 PM

సామర్లకోట: ప్రతి సంవత్సరము నిర్వహిస్తున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఈ నెల 31 శనివారం జరగనున్నట్లు మండల పాస్టర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సామర్లకోట సిబిఎం స్కూల్ నుంచి ప్రారంభమై సీతారామ కాలనీ, బెరాకా ప్రార్థనా మందిరము, బ్రౌన్ పేట, సెంట్రల్ అగస్తన లూథరన్ చర్చ్ ల మీదుగా కొనసాగి తిరిగి సిబిఎం స్కూల్ కి చేరుకొని ర్యాలీ ముగుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణంలో ఉన్న సంఘాలు, క్రైస్తవులు, క్రైస్తవ నాయకులు, కాపరులు ఎంతగానో సహకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్ వల్లూరి నోహాహు, కార్యదర్శి డాక్టర్ డి. సత్యానందం, సెక్రటరీ డాక్టర్ డి.జాన్ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణలోని క్రైస్తవులు అందరూ పాల్గొనాలని కోరారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us