దివిలి కిట్స్ లో మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన

UPDATED 3rd MARCH 2018 SATURDAY 10:00 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌశల్ గోదావరి సహకారంతో, వికాసా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఈ మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిధిగా జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ హాజరయ్యారు. ముందుగా కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా పనిచేస్తోందని, నిరుద్యోగ యువతీ యువకులకు వారి విద్యార్హతలు దృష్టిలో ఉంచుకుని ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. వికాసా మేనేజర్ లచ్చారావు మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాకు సుమారు 3000 మంది అభ్యర్థులు హాజరయ్యారని, వారిలో 501 మంది ఉద్యోగాలకు అర్హతః సాధించారన్నారు. కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ కళాశాలలో ఇటువంటి మెగా జాబ్ మేళాను నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జిల్లా పరిషత్ చైర్మన్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందచేశారు. అలాగే ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాలలో ఏసీటీవోగా ఎంపికైన గోపు రాజాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. రామకృష్ణ, ఏవో కె.ఆర్. సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసీవో పెదకాపు, వీరేంద్ర, టిడిపి మండలాధ్యక్షుడు కొత్తెం కోటి, తిరుపతి సర్పంచ్ మెయిళ్ల కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us